ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు హైఅలర్ట్‌.. ఏంటంటే?

దేశ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వినియోగదారులకు హైఅలెర్ట్.ఎందుకు ఈ అలర్ట్ అనుకుంటున్నారా.

అక్కడికే వస్తున్న.ఇకపై ఏటీఎం నుంచి విత్ డ్రా చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

ముఖ్యంగా డబ్బులు డ్రా చేసిన సమయంలో ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అయితే భారీగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది.అవును.

ఇకపై ఫెయిల్డ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తుంది.సాధారణంగా అయితే ఏటీఎం మెషిన్ పని చెయ్యకపోతే ట్రాన్సక్షన్ ఫెయిల్ అవుతుంది.

Advertisement

లేదా అకౌంట్ సరిపడా డబ్బులేని సమయంలో ట్రానాక్షన్‌ ఫెయిల్‌ అవుతుంది.ఇక ట్రానాక్షన్‌ ఫెయిల్‌ సమయంలో రూ.20+జీఎస్టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.మీకు ట్రానాక్షన్‌ ఫెయిల్‌ అని రాకూడదు అంటే మీరు ముందుగానే మీ అకౌంట్ లో డబ్బు ఎంత ఉంది? మీరు డ్రా చేసుకోవాల్సిన ఏటీఎం మెషిన్ పని చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి.అప్పుడే మీ ఏటీఎంలో డబ్బులు కట్ అవ్వవు.

కాగా ఎస్బీఐ ఏటీఎం వినియోగదారులకు నెలకు 8 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది.ఆపైన లావాదేవీలు చేస్తే డబ్బు కట్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు