ఈ కషాయంతో కీళ్ల నొప్పులకు చెప్పేయండి గుడ్ బై!

కీళ్ల నొప్పులతో బాగా బాధ పడుతున్నారా.? ఎన్ని మందులు వాడినా వాటి ఫలితం పెద్దగా కనిపించడం లేదా.

? కీళ్ల నొప్పుల వల్ల నిలబ‌డడానికి, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.నిజానికి కీళ్ల నొప్పులకు( Joint pain ) చెక్ పెట్టే ఔషధాలు మన వంటింట్లో ఎన్నో ఉన్నాయి.

అందులో అతిమధురం( Liquorice ) కూడా ఒకటి.దీనిని లైకోరైస్ రూట్ అని కూడా పిలుస్తారు.

కొన్ని వేల సంవత్సరాల నుంచి అతిమధురం ఒక ఔషధంగా ఉపయోగించబడుతుంది.జీర్ణశయాంతర సమస్యలు, మలేరియా, నిద్రలేమి మరియు ఇన్‌ఫెక్షన్‌లతో సహా అనేక రుగ్మతలకు చికిత్స చేయడానికి అతి మధురంను వాడుతున్నారు.

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండటం వల్ల అతి మధురం ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.కీళ్ల నొప్పులను వదిలించడానికి కూడా అతిమధురం ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement

వాటర్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ అతి మధురం చూర్ణాన్ని వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో అతి మధురం కషాయాన్ని వడకట్టి నేరుగా సేవించడమే.రోజుకో గ్లాసు ఈ అతి మధురం కషాయం తాగితే కొద్ది రోజుల్లోనే కీళ్ల నొప్పుల సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.ఎముకలు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.

ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.కాబట్టి కీళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పాలనుకునేవారు తప్పకుండా ఈ కషాయాన్ని డైట్ చేర్చుకోండి.

పైగా అతి మధురం కషాయాన్ని తాగడం వల్ల స్త్రీ పురుషుల్లో సంతాన సమస్యలు ఉంటే దూరం అవుతాయి.సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

'మిస్టర్ బచ్చన్ ' మూవీ రివ్యూ...రవితేజ కంబ్యాక్ ఇచ్చాడా..?
కాఫీ గింజలతో ఉపయోగాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే

అలాగే కొందరు నోటి పూతతో బాధపడుతుంటారు.అలాంటి వారు అతి మధురం కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మేయాలి.

Advertisement

ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే నోటి పూత సమస్య దూరం అవుతుంది.

తాజా వార్తలు