ప్రవాసులకి సౌదీ గుడ్ న్యూస్...త్వరపడండి..!

కరోనా కారణంగా విదేశాలలో ఉంటున్న ఎంతో మంది ప్రవాసులు తమ తమ దేశాలకి వెళ్ళిపోయారు.బ్రతికుంటే ఎలాగైనా బ్రతకచ్చు అనుకున్న వారు సొంత గ్రామాలకి వెళ్ళిపోయారు.

అయితే సౌదీ ప్రభుత్వం కూడా ఇతర దేశాలనుంచీ తమ దేశానికి ఎవరినీ రానివ్వకుండా నిభందనలు విధించింది కూడా.అయితే కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని భావించిన సౌదీ తమ దేశం విడిచి వెళ్ళిన ప్రవాసులు మళ్ళీ తిరిగి రావచ్చని ప్రకటించింది.

నిర్ణీత సమయంలో రాలేక పోయిన వాళ్ళు, వీసా గడువు ముగిసిన వాళ్ళు, జాబ్ వీసా, విజిటింగ్ వీసాలు ఉన్న వాళ్ళు ఎవరైనా తిరిగి మా దేశం వచ్చేయండంటూ ప్రకటించింది.సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల నుండి ప్రవాసులు తిరిగి సౌదీ రావచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం వాలిడ్ వీసా ఉన్న ప్రవాసులకు మాత్రమే అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం.గడువు ముగిసిన అలాగే రీ ఎంట్రీ వీసా, జాబ్ వీసా, విజిటింగ్ వీసాలు ఉన్న వాళ్ళు తిరిగి సౌదీ రావచ్చని ప్రకటించింది.

Advertisement

అయితే తమ దేశంలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 48 గంటల ముందుగా జారీ చేసే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాలని కండిషన్ విధించింది.అలా చూపించిన వారే తమ దేశంలోకి అడుగు పెట్టాలని తెలిపింది.

సౌదీ మళ్ళీ తమ దేశంలోకి ఆహ్వానించడంపై ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారత్ నుంచీ అత్యధిక శాతం మంది సౌదీ దేశాలకి వలసలు వెళ్తున్న విషయం విధితమే.

Advertisement

తాజా వార్తలు