సరైనోడు టాక్‌ ఏంటి?

మెగా మూవీ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ వచ్చి పది రోజులు అయ్యింది.ఆ సినిమా అభిమానులను అలరించలేక పోయింది.

ఆ సినిమా ప్రభావంను మెగా ఫ్యాన్స్‌ వెంటనే తేరుకోబోతున్నారు.ఈ వారంలో మరో మెగా హీరో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

భారీ అంచనాలున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈసినిమాను ఇదే నెల 22న విడుదల చేసేందుకు రంగం సిద్దం చేశారు.

ఇప్పటికే సెన్సార్‌ పూర్తి అయినా కూడా కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేడయం వల్ల మళ్లీ తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా గురించి సినీ వర్గాలతో పాటు చిత్రీయూనిట్‌ సభ్యులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

Advertisement

అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలు రాయి సినిమాగా నిలిచి పోవడం ఖాయం అంటూ సెన్సార్‌ బోర్డు సభ్యులు అనధికారికంగా అంటున్నట్లుగా తెలుస్తోంది.ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా చూసే విధంగా ఉందని, మాస్‌ సినిమా కదా అని పూర్తి స్థాయి మాస్‌గా కాకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను బోయపాటి చిత్రీకరించి ఆకట్టుకున్నాడు అంటూ సినిమాను ప్రివ్యూ చూసిన వారు అంటున్నారు.

అల్లు అర్జున్‌ కెరీర్‌లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలుస్తుందన్న నమ్మకంతో మెగా ఫ్యాన్స్‌ ఉన్నారు.ఇక ఇద్దరు ముద్దుగుమ్మలు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరియు కేథరిన్‌లతో బన్నీ చేసిన రొమాన్స్‌ అదిరి పోయిందని కూడా అంటున్నారు.

మరి విడుదలకు ముందు వచ్చిన ఈ టాక్‌ నిజమేనా అనేది తేలాలి అంటూ మరో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.

ఆ రికార్డు ఎన్టీఆర్ పేరిటే ఉంది.. ఏ హీరోకి సాధ్యం కాలేదు?
Advertisement

తాజా వార్తలు