తమన్నాకు ఇదే బాగా నచ్చినట్లుంది

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ‘ఊపిరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈమెకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

మరో వైపు ఈమె ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ చిత్రీకరణలో కూడా పాల్గొంటుంది.ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు మాత్రం ఐటెం సాంగ్స్‌ను వదలడం లేదు.

హీరోయిన్‌గా బిజీగా ఉన్న ఏ సౌత్‌ హీరోయిన్‌ కూడా ఐటెం సాంగ్స్‌కు ఓకే చెప్పరు.కాని తమన్నా మాత్రం ఇప్పటికే ‘అల్లుడు శీను’ మరియు ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ హీరోతో ఐటెం సాంగ్‌ చేసి అదరగొట్టింది.

మళ్లీ ఇప్పుడు మరో ఐటెం సాంగ్‌కు ఈ అమ్మడు పచ్చ జెండా ఊపినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనత గ్యారేజ్‌’ చిత్రంలో ఈ అమ్మడితో ఐటెం సాంగ్‌ చేయించబోతున్నారు.

Advertisement

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ ఆమెతో మాట్లాడటం, ఆమె ఒప్పుకోవడం కూడా జరిగిందని తెలుస్తోంది.తమన్నాకు హీరోయిన్‌గా నటించడం కంటే కూడా అధికంగా ఐటెం సాంగ్స్‌ చేయడం అంటేనే ఇష్టం అని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

తక్కువ కష్టం మరియు ఎక్కువ పారితోషికం అనే ఉద్దేశ్యంతోనే తమన్నా ఐటెం సాంగ్స్‌ను ఇష్టపడుతుందేమో అని కొందరు అంటున్నారు.అయితే తమన్నా ఐటెం సాంగ్స్‌పైనే దృష్టి పెట్టడం ఆమె అభిమానులకు రుచించడం లేదు.

తమ్మూ హీరోయిన్‌గా కూడా రాణించాలనేది వారి అభిమతం.తాజాగా ‘అభినేత్రి’ అనే ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రంలో తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు