పాప ఆపరేషన్ కు ఖర్చులు భరిస్తానన్న మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రెక్కాడితే గాని డొక్కా నిండని నిరుపేద కుటుంబం వారిది.కనబడిన దేవుళ్ళంధరికి సంతానం కోసం మొక్కుకోగా ఆ దంపతులకు పాప జన్మనిచ్చింది.

పాప జన్మనిచ్చిందని చెప్పలేని సంతోషం పొందిన ఆ నిరుపేద దంపతులకు కొద్ది రోజులకు మూగ చెవుడని తెలియగానే నిరాశ కు గురైనారు.ఆదంపతులకు అంతుపట్టకుండా ఉంది వాళ్ళ పరిస్థితి ఆ పాపకు మూగ చెవుడు ఆపరేషన్ చేయించి నయం చేయడానికి పలు ఆసుపత్రులకు చెప్పులరిగేలా తిరిగారు.

ఆపరేషన్ చేయించడానికి ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన నర్సయ్య దంపతులు ఆపోలో హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు.పాపకు ఆపరేషన్ చేస్తే చెవుడు గొంతు వస్తాయని పది లక్షల రూపాయల ఖర్చవుతుందని డాక్టర్లు తెలపగా గత ఆరు ఏడు సంవత్సరాల నుండి ఈ పాప పరిస్థితి చూసుకుంటూ దుఃఖంతో కృంగిపోతున్న తల్లిదండ్రులు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ని ఆశ్రయించారు.

వెంటనే స్పందించిన నేవూరి వెంకట్ రెడ్డి ఆ పాప పరిస్థితి ని చూసి చలించి తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆ పాప ఆపరేషన్ కు అయ్యే పది లక్షల రూపాయల మొత్తం ఖర్చులు తానే భరించి ఆ పాప ఆపరేషన్ చేయించడానికి ఏర్పాట్లు చేపిస్తున్నట్ట్లు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి తెలిపారు.పాప పరిస్థితి ఎంతోమందికి తెలియచెప్పినప్పటికీ ఎవరు స్పందించలేదని ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించినందుకుగాను వారికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆ పాప తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement
ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !

Latest Rajanna Sircilla News