సంగారెడ్డి జిల్లా చౌటకూర్ 161వ జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం.. !

ప్రమాదం ఎవరికి ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో గ్రహించడం చాలా కష్టం.

అందులో ఏదైనా పని ఉండి బయటకు వెళ్లుతున్నారంటే తిరిగి ఇంటికి వచ్చే వరకు మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు.

ముఖ్యంగా రహదారులు దాహంతో అలాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.అందుకే కావచ్చూ తమ దాహం తీరడానికి రక్తాన్ని తాగుతున్నాయి.

పూర్తిగా రక్తసికమై కనిపిస్తున్నాయి.రోజు రోజుకు హైవేల మీద జరుగుతున్న వాహనాల ప్రమాదాలను చూస్తున్న వారికి గుండెల్లో దడ పుట్టక మానదు.

అయినా పదిలంగా ప్రయాణిస్తున్నారా అంటే అదీ లేదు.వెధవ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత చేతిలో బండి ఉంది.

Advertisement

కావల్సినంతగా ఎక్స్‌లేటర్ ఇస్తే ఆ వేగానికి గాల్లో తేలిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.అంతే స్పీడ్‌గా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కూడ అని ఆలోచిస్తారు కావచ్చూ.

అందుకే రోడ్దు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి.ఇదిగో ఈ వేగమే ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుందట.

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ వద్ద 161వ జాతీయ రహదారి పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.మృతుడి తల పై నుండి ప్రమాదానికి కారణం అయినా వాహనం వెళ్లడంతో ఆ యువకుని మృతదేహం గుర్తు పట్టలేని విధంగా మారింది.

ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు