Samantha yashoda : మయోసైటిస్ 'యశోద' ను కాపాడాయా? లేదా?.. కలెక్షన్స్ పరిస్థితి ఏంటీ?

సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా కోసం గత రెండు మూడు నెలలుగా ఆమె అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

హరి హరీష్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సరోగసి పేరు తో జరుగుతున్న నేరాలను చూపించే హీరోయిన్ పాత్ర లో సమంత ఈ సినిమా లో కనిపించబోతుంది అంటూ ముందుగానే తెలియజేశారు.సినిమా కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అంటూ టీజర్ మరియు ట్రైలర్ల లో చూపించారు.

కానీ ఆ స్థాయి లో సినిమా లేదనే చెప్పాలి.టాలీవుడ్ బాక్సాఫీస్ తో పాటు ఏ భాష లో కూడా ఈ సినిమా ఆకట్టుకోలేక పోతుంది అంటూ సమాచారం అందుతుంది.

100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేస్తుంది అంటూ అంతా చాలా నమ్మకం తో ఉన్నారు.కానీ ఈ సినిమా కనీసం పాతిక కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్టే అవకాశం లేదని తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు బాక్సాఫీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Advertisement

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సమంత కు మంచి క్రేజ్ ఉంది.కానీ అక్కడ ఇక్కడ ఈ సినిమా పెద్దగా వసూళ్ల ను రాబట్టలేక పోతుంది.హిందీ లో కూడా ఈ సినిమా ను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

అక్కడ ఈ సినిమా యొక్క పరిస్థితి మరి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి.మొత్తానికి మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ నిరాశ పరిచినట్లుగానే చెప్పుకోవాలి.

సమంత ప్రస్తుతం మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే ఆ వ్యాధి తో కూడా సమంత మీడియా ముందుకు వచ్చి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది.కనుక సింపతీ వర్కౌట్‌ అవుతుందని.

యశోద సినిమా సూపర్ హిట్ అవుతుందని అంతా భావించారు.కానీ సింపతీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

సమంత యొక్క దీర్ఘకాలిక వ్యాధి యశోద సినిమా ను కాపాడలేక పోయినట్లే అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు