సమంత 'ఖుషి' తర్వాత మరింత స్పీడ్... టాలీవుడ్‌ లో సర్‌ ప్రైజింగ్‌ ప్రాజెక్ట్స్‌

టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ సమంత.

ఒక వైపు ఖుషి సినిమా ( kushi movie )లో నటిస్తూనే మరో వైపు సిటాడెల్ ( Citadel )అనే హిందీ సిరీస్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

హీరోయిన్ గా ఈఅమ్మడు సాధిస్తున్న విజయాలను చూసి అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.ముందు ముందు ఇదే రేంజ్ లో ఈ అమ్మడు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ యాక్షన్‌ సన్నివేశాలకు కష్టపడే తత్వం ఉన్న ఈ అమ్మది యొక్క ఆఫర్లు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.మొత్తానికి ఈమె యొక్క సినిమాలు మరియు సిరీస్ ల జోరు మామూలుగా లేదు.

ప్రస్తుతం హిందీ లో సిటాడెల్‌ సిరీస్ లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు అంతకు మించి అన్నట్లుగా భారీ హిందీ వెబ్‌ సిరీస్‌ లను మరియు సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యింది.అంతే కాకుండా ఖుషి సినిమా తర్వాత టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది.

Advertisement

సీనియర్ స్టార్ హీరోలు సమంత( Samantha )తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఎందుకంటే నాగ చైతన్య తో ఆమె విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే.అందుకే టైర్ 2 హీరోలు కొందరు ఈమె తో వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఖుషి సినిమా విడుదల అయిన తర్వాత సక్సెస్ టాక్‌ ని దక్కించుకుంటే తప్పకుండా భారీ ఎత్తున లేడీ ఓరియంటెడ్‌ సినిమా లను కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఖుషి సినిమా భారీ ఎత్తున వసూళ్లతో దూసుకు పోతుంది.

ఆకట్టుకునే మంచి కథలను మరియు మంచి స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుంటే భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మంచు మనోజ్ విలన్ గా రాణిస్తాడా..? ఆయన కోసం కొన్ని క్యారెక్టర్స్ ను క్రియేట్ చేస్తున్నారా..?
Advertisement

తాజా వార్తలు