సమంత తిరుమల కాలి నడకన ఎక్కినందుకు ఫలితం దక్కింది  

Samantha Climbs Steps For Majili Success-majili Movie Review,majili Success,samantha

 • అక్కినేని సమంత ‘మజిలీ’ విడుదలకు మూడు రోజుల ముందు తిరుపతి నుండి తిరుమలకు కాలి నడకన వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెల్సిందే. ఆ వెంకటేశ్వర స్వామి సమంత మొర ఆలకించాడో ఏమో కాని మజిలీ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగచైతన్యకు మజిలీ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం.

 • సమంత తిరుమల కాలి నడకన ఎక్కినందుకు ఫలితం దక్కింది-Samantha Climbs Steps For Majili Success

 • సమంతకు మజిలీ సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా పర్వాలేదు. కాని చైతూకు మాత్రం ఇది సక్సెస్‌ అయితేనే కెరీర్‌ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది.

 • అందుకు మజిలీ చిత్రంను సక్సెస్‌ చేయాలని సమంత చాలా తాపత్రయ పడింది.

  ఆమె చేసిన ప్రార్థనలు మరియు పూజల వల్ల ఆమెకు ఈ చిత్రం సక్సెస్‌ను అందించింది.

 • కేవలం సక్సెస్‌ మాత్రమే కాకుండా నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అంటూ టాక్‌ను దక్కించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు అన్ని ఏరియాల ద్వారా వసూళ్లు భారీగా వచ్చాయి.

 • మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 12.5 కోట్ల వసూళ్లను నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. చైతూ సినిమా మొదటి వీకెండ్‌ కలెక్షన్స్‌ ఈ స్థాయిలో ఉండటం రికార్డుగా ట్రేడ్‌వర్గాల వారు చెబుతున్నారు.

  Samantha Climbs Steps For Majili Success-Majili Movie Review Majili Success

  సమంత ఈ చిత్రంలో మొదటి సగం పూర్తి అయ్యే సమయానికి ఎంట్రీ ఇస్తుంది. అంటే ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఆమె కనిపించకుండా పోతుంది.

 • ఫ్ల్యాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు ఉంటాయి. ఇక సెకండ్‌ మొత్తం కూడా సమంత తన బుజాలపై సినిమాను వేసుకుని నడిపించింది.

 • అన్ని విధాలుగా సమంతకు ఈ చిత్రం మంచి గుర్తింపును, సంతోషాన్ని తెచ్చింది. ఈ సినిమా విడుదల రోజు తెల్లవారు జామున పావుతక్కువ మూడు గంటలకు లేచి సినిమా ఫలితం కోసం ఎదురు చూసిందట.

 • ఫస్ట్‌ రిపోర్ట్‌ వినగానే సంతోషంగా 30 నిమిషాలు కన్నీళ్లు పెట్టుకుందట. మొత్తానికి సమంతకు ఆ శ్రీవెంకటేశ్వరుడు సక్సెస్‌ ను ఇచ్చాడని చెప్పుకోవచ్చు.