సామజవరగమనా.. కొత్తగా పాడింది ఎవరో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ అల వైకుంఠపురములో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా థమన్ చక్కటి బాణీలు అందించాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలకు అన్ని వర్గాల శ్రోతల నుండి భారీ ఆదరణ లభిస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలోని సామజవరగమన అనే సాంగ్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది.

సిడ్ శ్రీరామ్ పాడిన ఈ చక్కటి పాటకు ప్రపంచవ్యాప్తంగా శ్రోతలు బాగుందని మెచ్చుకున్నారు.ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన పాటను థమన్ మరోసారి కొత్తగా ప్రయోగం చేసి వదిలాడు.

ఈసారి ఫీమేల్ వర్షన్‌తో ఈ పాటను రిలీజ్ చేశాడు.ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్ ఈ పాటను ఆలపించింది.

Advertisement

ఈ పాటకు సంబంధించిన వీడియోను తాజాగా థమన్ రిలీజ్ చేశాడు.ఇప్పుడు ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది.

ఏదేమైనా ఒకే పాటను రెండు వాయిస్‌లతో పాడించి మెప్పించిన థమన్‌ను ప్రేక్షకులతో పాటు చిత్ర యూనిట్ శభాష్ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు