'సలార్' మేకర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. కారణం ఇదేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.

ఈయన ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసి అంచనాలు అమాంతం పెంచేశారు.ముందు నుండి భారీ అంచనాలు పెరుగగా టీజర్ తో అమాంతం పెరిగి పోయాయి.

Salaar Movie Latest Update, Salaar, Salaar Rights, Prabhas, Prashanth Neel,

మేకర్స్ టీజర్ రిలీజ్ అవ్వగానే ట్రైలర్ ఈ ఆగస్టులో రాబోతుంది అని అనౌన్స్ చేసారు.దీంతో అంతా కూడా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు.కానీ మేకర్స్ టీజర్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నారు.

మరి మేకర్స్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటా అని అంతా ఆరా తీస్తున్నారు.ట్రైలర్ తో పాటు ఫస్ట్ సింగిల్ కోసం కూడా అంత ఎదురు చూస్తున్నారు.

Salaar Movie Latest Update, Salaar, Salaar Rights, Prabhas, Prashanth Neel,
Advertisement
Salaar Movie Latest Update, Salaar, Salaar Rights, Prabhas, Prashanth Neel,

కానీ మేకర్స్ చిత్ర యూనిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు తప్ప ఏమీ యాక్టివ్ గా లేరు.ఇలా సైలెంట్ గా ఉండడంతో మళ్ళీ సలార్ కూడా వాయిదా పడుతుందా అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెలలో ట్రైలర్ వస్తే రిలీజ్ కన్ఫర్మ్ అయినట్టే.

లేకపోతే రిలీజ్ డౌట్ అంటున్నారు.కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan )హీరోయిన్ గా నటిస్తుండగా.

హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

ఆదిపురుష్ వంటి ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.చూడాలి ఈ సినిమా అయిన ప్రభాస్ కెరీర్ లో బాహుబలి రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు