ఏపీ సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు ఈ నెల 21వ తారీకు అని అందరికీ తెలుసు. ప్రతి ఏడాది జగన్ పుట్టిన రోజును వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు చాలా గ్రాండ్ గా జరుపుతారు.
డిసెంబర్ 21వ తారీకు నాడు జరిగే జగన్ పుట్టిన రోజును పండగలా చేసుకుంటారు.ఒక సినిమా హీరో పుట్టినరోజు నాడు జరిగే హడావిడి జగన్ పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో జరగటం గ్యారెంటీ.
పరిస్థితి ఇలా ఉంటే ఈ ఏడాది జరగబోయే పుట్టినరోజు వేడుకల విషయంలో పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు.సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
అభిమాన నాయకుడు అధినేత జగన్ పుట్టినరోజు నాడు.పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ.
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ, రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం . వంటి సేవా కార్యక్రమాలు… రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు తెలియజేయడం జరిగింది.ఇదిలా ఉంటే అదే రోజు ఏపీ ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.