'సైరా'కు అక్కడ పాజిటివ్‌ టాక్‌ వచ్చినా నెగటివ్‌ కలెక్షన్స్‌

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి గాంధీ జయంతి సందర్బంగా ఇటీవల విడుదలైన విషయం తెల్సిందే.

సినిమాకు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

అన్ని చోట్ల కూడా పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి.ముఖ్యంగా బాలీవుడ్‌ మూవీ వార్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అంటూ రివ్యూలు ఇచ్చిన బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సైరా హిందీ వర్షన్‌కు బ్రహ్మరథం పట్టినట్లుగా ఏకంగా 3.75.4 రేటింగ్స్‌ ఇచ్చారు.బాలీవుడ్‌లో సైరా చిత్రం భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అంతా భావించారు.

కాని అనూహ్యంగా ఫలితం తారు మారు అయ్యింది.సైరా చిత్రం హిందీ వర్షన్‌కు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ మాత్రం నిల్‌గా ఉన్నాయి.

వార్‌ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా 100 కోట్ల సినిమా కలెక్షన్స్‌ చేరే పరిస్థితి ఉంది.హృతిక్‌ రోషన్‌ సినిమా అవ్వడం వల్ల ఆ చిత్రం ముందు సైరా నిలవలేక పోయింది.

Advertisement

వార్‌ సినిమాతో పోటీ వద్దనుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ తర్వాత ఏం జరిగిందో కాని మళ్లీ అదే తేదీకి సినిమాను విడుదల చేశారు.దాంతో అనుకున్నట్లుగానే వార్‌ ఎఫెక్ట్‌ సైరాపై కనిపించింది.

  సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగా వసూళ్లను రాబడుతోంది.పోటీ లేకపోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఉన్నాయి.ఆ కారణంగా సినిమాకు రికార్డు స్థాయిల వసూళ్లు నమోదు అవుతున్నాయి.

ప్రతి ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంటున్న సైరా చిత్రం నాన్‌ బాహుబలి రికార్డును చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.సాహో కంటే అధికంగా సైరా వసూళ్లు నమోదు అవుతాయని ట్రేడ్‌ నిపుణులు అంటున్నాయి.

సాహోకు బాలీవుడ్‌లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.కాని సైరా మాత్రం అక్కడ సత్తా చాటడంలో విఫలం అవుతోంది.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు