చరణ్ సాయిపల్లవి కాంబినేషన్ లో సినిమా.. నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అంటూ?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ మూవీ తో( RRR ) గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు అదే ఊపుతో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో( Game Changer ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం.

దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్లో బాగా బిజీ బిజీగా ఉండడంతో ఈ గేమ్ ఛేంజర్ సినిమా ఆలస్యం అవుతోంది.దీంతో ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ సినిమాని( RC16 ) మొదలు పెట్టాలని చూస్తున్నారు.

Advertisement

అయితే రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు( Buchibabu ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

స్పోర్ట్స్ డ్రామాగా( Sports Drama ) రూపొందనున్న ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.మొదట ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవిని( Sai Pallavi ) హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు పర్ఫెక్ట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఒకవేళ సాయి పల్లవి కనుక ఈ సినిమాలో నటిస్తే ఆమె తెలుగులో స్టార్ హీరో పక్కన నటించడం ఇదే మొదటి సినిమా అవుతుంది.ఇప్పటివరకు ఆమె వరుణ్ తేజ్ నాని శర్వానంద్ నాగచైతన్య రానా వంటి హీరోల పక్కన నటించి మెప్పించింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.

Advertisement

తాజా వార్తలు