7వ రోజు అక్కడ జీరో షేర్.. విరూపాక్ష దారుణమైన వసూళ్లు!

టైర్ 2 హీరోల్లో ఒకరైన సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తో వచ్చి ఇన్నేళ్ల గ్యాప్ ను ఒక్క సినిమాతోనే ఫుల్ ఫిల్ అయ్యేలా చేసుకున్నాడు.

సాయి తేజ్ హీరోగా సంయుక్త మీనన్( Samyuktha Menon ) హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా విరూపాక్ష.

(Virupaksha ) మొదటి రోజు కంటే ఆ తర్వాత వీకెండ్ లో పుంజుకుని స్ట్రాంగ్ వసూళ్లను రాబట్టింది.ఇక రెండవ వారం, మూడవ వారాలు కూడా బాగానే కలెక్షన్స్ రాబట్టింది.

కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయి సాయి తేజ్ కు గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ అందుకుంది.

అయితే ఇక్కడ సూపర్ హిట్ అయిన ఈ సినిమాను మే 5న తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా పక్క భాషల్లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది.హర్రర్ థ్రిల్లర్ ను పక్క భాషల్లో వారు ఆదరిస్తారు అని మేకర్స్ అనుకున్నారు కానీ వీరి అంచనాలను తిరగరాసింది.ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన 7వ రోజు ఆ భాషల్లో ఈ సినిమాకు జీరో షేర్ వచ్చిందట.

అంతే ఒక్కటంటే ఒక్క లక్ష కూడా వసూళ్లు చేయలేదు.

ఇలా విరూపాక్ష లాగా ఏ తెలుగు సినిమాకు కూడా జీరో షేర్ రాలేదు అని ట్రేడ్ వర్గాలు సైతం చెబుతున్నారు.దీంతో ఇంత సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఇంట భారీగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రచ్చ గెలవలేక పోయింది.ఇక ఈ సినిమా ఇప్పటి వరకు 90 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు రాబట్టగా.46 కోట్లకు పైగా షేర్ ను వసూళ్లు చేసింది.దీంతో 23 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుంది.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..
Advertisement

తాజా వార్తలు