కుంకుమపువ్వుతో ఇలా చేస్తే మీ లిప్స్‌కి లిప్‌స్టిక్ అక్క‌ర్లేద‌ట‌..?!

సాధార‌ణంగా కొంద‌రి పెదాలు న‌ల్ల‌గా ఉంటాయి.

ఆహార‌పు అల‌వాట్లు, డీహైడ్రేష‌న్‌, పెదాలను కొరకడం, పెదాలను తరచూ తడి చేస్తుండం, ఎండ‌ల ప్ర‌భావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవ‌డం, కెఫిన్ అధికంగా తీసుకోవ‌డం, స్మోకింగ్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పెదాలు న‌ల్ల‌గా మారిపోతుంటాయి.

అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ.న‌ల్ల‌టి పెదాల‌ను క‌వ‌ర్ చేసేందుకు లిప్ స్టిక్స్‌ను తెగ వాడుతుంటారు.

అయితే కుంకుమ‌పువ్వుతో ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే లిప్స్‌కి లిప్‌స్టిక్ అక్క‌ర్లేద‌ట‌.కుంకుమ‌పువ్వులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు లిప్స్‌ను స‌హ‌జంగానే ఎర్ర‌గా మారుస్తాయి.

మ‌రి లేటెందుకు కుంకుమ‌పువ్వును లిప్స్‌కు ఎలా వాడాలో ఇప్పుడు చూసేయండి.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ గులాబీ రేకుల పేస్ట్‌, ఒక స్పూన్ ప‌చ్చి పాలు, చిటికెడు కుంకుమ‌పువ్వు పొడి మ‌రియు ఒక స్పూన్ తేనె క‌లిపి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెద‌వుల‌కు అప్లై చేసి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.ఆపై కాస్త డ్రై అవ్వ‌నిచ్చి చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే పెదాలు ఎర్ర‌గా, మృదువుగా మార‌తాయి.అలాగే ఒక బౌల్ తీసుకుని స్పూన్ పెరుగు, కొద్దిగా కుంకుమ పువ్వు పొడి వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని లిప్స్‌కు అప్లై చేసి అర గంట త‌ర్వాత మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా న‌ల్ల‌టి పెదాలు ఎర్ర‌గా, అందంగా త‌యార‌వుతాయి.

ఇక నాలుగు కుంకుమపూరేకలను చెంచా పాలల్లో గంటసేపు నాన బెట్టుకుని మెత్త‌గా పేస్ట్ చేయాలి.ఆపై అందులో కొద్ది నిమ్మ ర‌సం యాడ్ చేసి పెదాల‌కు పూయాలి.పావు గంట లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అప్పుడు వాట‌ర్‌తో వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు