విమర్శల పాలవుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటో.. మ్యాటరేంటంటే?

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ ( Coimbatore )పట్టణ సమీపంలో ఉన్న ఇషా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికత, యోగ ఇలా ఇంకా అనేక విషయాలపై బోధనలు చేసే సద్గురు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందారు.

ఇకపోతే తాజాగా ఇషా లైఫ్ E - షాపులో ( Isha Life E - Shop )సద్గురు పాదాలకు సంబంధించిన ఫోటో ఇప్పుడు చర్చినీయాంసంగా మారింది.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెళితే.

ఆధ్యాత్మిక గురువు సద్గురు పాదాల ఫోటోను వెబ్సైట్ లో రూ.3200 ఉండటం ఇప్పుడు చర్చినీయాంసంగా మారింది.ఈ ఫోటోకు ఆన్లైన్ లో " గురువు పాదాలకు నమస్కరించడం అనేది మంచిది.

అది గురువుతో లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది" అంటూ వివరణ ఇచ్చారు.అయితే ఈ ఫోటోపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

మరికొందరేమో ఇదేదో సినిమాలో చూసిన విధంగా ఉందంటూ నవ్వుకుంటున్నారు కూడా.ఇకపోతే.

, ఇద్దరు మహిళలను నిర్బంధించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్ లోని తొండ ముత్తూట్ లో ఉన్న ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో 150 మంది పోలీసుల అధికారుల బృందం తాజాగా సోదాలు నిర్వహించారు.ఇక ఇలాంటి ఘటనలపై నమోదైన కేసులపై హైకోర్టు నివేదికను కోరింది.

ఈ సందర్భంగా జస్టిస్ సుబ్రమణ్యం, శివజ్ఞానంతో కూడిన ధర్మాసనం ఇషా ఫౌండేషన్ లో అమలవుతున్న పద్ధతులపై ప్రశ్నలలో లేవనెత్తారు.ఈ సందర్భంగా జగ్గీ వాసుదేవ్ ఆయన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని., అయితే అనేక మంది యువతలను సన్యాసులుగా జీవించమని ఆయన ఎందుకు ప్రోత్సహించారని కోర్టు ప్రశ్నలను గుప్పిచ్చింది.

ఇదివరకు కూడా ఇషా యోగ సెంటర్ కు సంబంధించి వైద్యుడు పై పోక్సో చట్టం కింద కేసు బుక్ అయిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.అయితే ఈ ఆరోపణలను ఇషా ఫౌండేషన్ తోసి పుచ్చింది.

అమ్మో! ప్రపంచంలో 43 లక్షల రోబోలు పని చేస్తున్నాయట.. ఆ దేశంలోనే హైయ్యెస్ట్?
Advertisement

తాజా వార్తలు