ఆ కంపెనీలో అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకుంటే బోనస్ ఇస్తారు

ఇండియాలో చీర కట్టుకోవడం సంప్రదాయం.

అలాంటి కట్టు బొట్టుని ప్రోత్సహించడానికి ఆ మధ్యకాలంలో చాలా విద్యా సంస్థలు, కంపెనీలు అందరూ చీరలు కట్టుకొని రావాలని రూల్స్ పెట్టాయి.

ఇదిలా ఉంటే రష్యాలో ఓ ప్రముఖ కంపెనీ తమ మహిళా ఉద్యోగులు మేకప్ వేసుకొని స్కర్ట్స్ వేసుకోనని ఆఫీస్ కి వస్తే బోనస్ ఇస్తామని ప్రకటించింది.ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మేకప్ వేసుకొని స్కర్ట్ లతో వచ్చిన మహిళా ఉద్యోగులు తమ ఫోటోలు తీసి వాట్సాప్లలో షేర్ చేస్తే అదనంగా రోజుకి 1.05 రూబెల్స్ ఇస్తామాన్ని ప్రకటించింది.టాట్‌ప్రూఫ్ అనే కంపెనీ ఫెమినినిటీ మారథాన్ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు ఈ విన్నూత్న కార్యక్రమాన్ని మొదలెట్టింది.

పనిచేసే చోట వెలుగులు నింపేందుకు ఈ రోజుల్లో మహిళలు స్కర్టులు ధరించి రావాలని అలా వచ్చిన వారికి బోనస్ వర్తిస్తుంది అని పేర్కొంది.స్కర్టులు ఐదు అంగుళాలకు ఎక్కువ కాకుండా, మోకాళ్లు కనిపించేళా ఉండాలని కండిషన్స్ కూడా పెట్టింది.

దీనిపై ఆ కంపెనీ కమ్యూనికేషన్స్ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ మహిళల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చారు.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు