పిల్లల్లో ముక్కు కారడం కరోనా లక్షణమేనా..?

దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజురోజుకు కరోనా కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.జలుబు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు కరోనా లక్షణాలు కాగా పిల్లల్లో ముక్కు కారుతున్నా చాలామంది కరోనా సొకిందేమో అని తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

Is Runny Nose A Symptom Of COVID-19, Coronavirus, Runny Nose, Children,Corona Sy

పిల్లల్లో సాధారణ జలుబు చేసినా ముక్కు విపరీతంగా కారుతుందని తల్లిదండ్రులు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.కరోనా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటున్నాయని జలుబు, దగ్గు ఉన్నంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

కరోనాతో వచ్చిన జలుబుకు ముక్కుదిబ్బడ ఉంటుందని ముక్కు కారడం కరోనా లక్షణం కాదని తెలుపుతున్నారు.ప్రొఫెస‌ర్ టిమ్ స్పెక్ట‌ర్ డైలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముక్కు కారడంతో బాధ పడుతున్న వారు సాధారణ జలుబుకు చికిత్స తీసుకుంటే సరిపోతుందని.

Advertisement

కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.టిమ్ స్పెక్ట‌ర్ లండ‌న్‌లోని కింగ్స్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని చేస్తారు.

పిల్లల తల్లిదండ్రులు కరోనా లక్షణాల గురించి అవగాహన పెంచుకుంటే మంచిదని పేర్కొన్నారు.కొన్ని రోజుల క్రితమే యూకేలో విద్యాసంస్థలు తెరుచుకున్నాయి.

దీంతో తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ విషయాలను వెల్లడించారు.వైద్యులు సైతం విద్యార్థుల తల్లిదండ్రుల్లో కరోనా లక్షణాలపై అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలని టిమ్ స్ప్రెక్టర్ సూచించారు.

మరోవైపు భారత్ లో ప్రతిరోజూ 80 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటుండగా 2021 జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు