Ruhani Sharma : ఆ హీరోయిన్ కి అందుకే ఛాన్సులు రావట్లేదా..!

చిలసౌ సినిమాతో తన టాలెంట్ చూపించిన హీరోయిన్ రుహాని శర్మ కథల విషయంలో చాలా స్లోగా ఉంది.

హిట్ తర్వాత ఎమ్మెస్ రాజు డైరక్షన్ లో డర్టీ హరి మూవీ చేసినా పెద్దగా లాభం లేకుండా పోయింది.

సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు మాత్రమే చేస్తా అంటున్న రుహాని శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తా.

సినిమాలో తను నటించాలంటే తన పాత్ర చాలా క్లియర్ గా ఉండాలి అంటూ తెగ కండీషన్స్ పెడుతుందట.అందుకే అమ్మడికి సరైన అవకాశాలు రావట్లేదని అంటున్నారు.

హీరోయిన్గా ఛాన్సులు రావడమే ఓ లక్ అనుకుంటుంటే వచ్చిన వాటికి అది బాలేదు ఇది బాలేదు అని చెప్పి రివర్స్ పంపించడం చేస్తుందట రుహాని శర్మ.

Advertisement

అందుకే అమ్మడు కెరీర్ లో వెనకపడుతుంది.ఇప్పటికీ తను అన్న మాట మీదే పాత్ర బాగుంటేనే చేస్తా అంటుందట.ఈ క్రమంలో తెలియకుండానే రుహాని వెనకపడిపోతుంది.

ప్రస్తుతం ఉన్న పోటీలో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తా అనే భామలు ఉన్నారు.అలాంటిది తన కోసం స్పెషల్ రోల్స్ రావాలనుకుంటూ కూర్చుంటే కరెక్ట్ కాదు.

మరి ఈ విషయంలో రుహాని తన నిర్ణయాన్ని మార్చుకుంటేనే బెటర్ లేదంటే అమ్మడి పని అయిపోయినట్టే అని చెప్పొచ్చు.

ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు