ఆర్టీసీ ఆదాయం పెరిగింది.. ఎండీ సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.అదేవిధంగా త్వరలోనే హైదరాబాద్ నగరంలోకి 30 ఏసీ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.

సెప్టెంబర్ నుంచి పది డబుల్ డెక్కర్ బస్సులను నడుపుతామని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.అంతేకాకుండా ప్రభుత్వం సహకరిస్తే కార్మికులకు పీఆర్సీ ఇస్తామని ప్రకటించారు.

ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు అన్ని డీఏలు ఇచ్చామన్న ఆయన సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంటే జీతాల పెంపుపై ఆలోచిస్తామని వెల్లడించారు.ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించామని తెలిపారు.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)
Advertisement

తాజా వార్తలు