ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్ హక్కులు వారి సొంతం... అఫీషియల్ కన్ఫర్మేషన్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ తో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.

ఈ మూవీ మీద దేశ వ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.

బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న సినిమా కావడం అందరి దృష్టి దీనిపై ఉంది.దానికి తగ్గట్లుగానే రియల్ హీరోల పాత్రలతో ఈ మూవీ కథాంశం సిద్ధం చేసుకొని రాజమౌళి తెరపై భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా ఆవిష్కరిస్తున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన క్యారెక్టర్ టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.మెగా, నందమూరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ తాజాగా అమ్ముడుపోయాయి.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.

Advertisement

ఆ సినిమా థియేటర్‌లో విడుదల తర్వాత డిజిటల్‌, శాటిలైట్‌ ప్రసార హక్కులనుపెన్‌ స్టూడియోస్‌దక్కించుకుంది.దేశంలోనే అతిపెద్ద సినిమా ఒప్పందంగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ప్రకటన చేసింది.

సినిమా ప్రసారం కానున్న డిజిటల్‌(ఓటీటీ), శాటిలైట్‌(టీవీ ఛానల్) వివరాలు కూడా పెన్‌ స్టూడియోస్ వెల్ల‌డించింది. ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, కొరియన్‌, టర్కిష్‌, స్పానిష్‌ భాషల్లో ప్రసార హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది.

అలాగే హిందీ శాటిలైట్ రైట్స్ ని జీ స్టూడియోస్ దక్కించుకుంది.సౌత్ శాటిలైట్ రైట్స్ స్టార్ యాజమాన్యం సొంతం చేసుకుంది.

అలాగే హిందీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకాగా, సౌత్ బాషలలో డిజిటల్ హక్కులు జీ5 సొంతం చేసుకుంది.ఏషియన్ నెట్ కూడా మలయాళీ హక్కులు సొంతం చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మొత్తానికి ఇండియన్ వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద సినిమా బిజినెస్ డీల్ ఇదే కావడం నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీకి దక్కిన అరుదైన రికార్డ్ గా చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు