బాలయ్య డైలాగ్ తో రచ్చ చేసిన రోజా.. గేటు కూడా తాకనివ్వనంటూ?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, రోజా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో రోజా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా ఆ పాత్రకు మంచిపేరు వచ్చింది.

ప్రస్తుతం రోజా టీవీ షోలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా ప్రజలకు మంచి చేస్తూ ఎమ్మెల్యేగా మంచి పేరును సొంతం చేసుకున్నారు.

నగరి నియోజకవర్గ ప్రజలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి వస్తే రోజా వెంటనే ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.మరోవైపు రోజా ప్రత్యర్థులు చేసిన విమర్శలకు ధీటుగా స్పందిస్తున్నారు.

తాజాగా బద్వేల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఈ ఎన్నికల ఫలితాల గురించి రోజా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Roja Uses Balakrishnas Legend Dialogue To Defend Her Political Opponents Details

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎవరినైనా సరే సింగిల్ హ్యాండ్ తో మట్టికరిపించగల సత్తా ఉందని రోజా చెప్పుకొచ్చారు.

Roja Uses Balakrishnas Legend Dialogue To Defend Her Political Opponents Details

అన్ని పార్టీలు చేతులు కలిపినా వైసీపీనే గెలిచిందని రోజా పేర్కొన్నారు.బీజేపీని ఎమ్మెల్యే సీటు కాదని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ రోజా బాలయ్య బాబు డైలాగ్ చెప్పి రచ్చ చేశారు.కొన్నిరోజుల క్రితం రోజా ఫోన్ ద్వారా జబర్దస్త్ సెట్ నుంచి బాలకృష్ణతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

అనసూయ కోరడంతో రోజా బాలకృష్ణకు ఫోన్ చేశారు.

Roja Uses Balakrishnas Legend Dialogue To Defend Her Political Opponents Details

మరోవైపు తాజాగా బాలయ్య కుడి భుజానికి సర్జరీ జరగగా ప్రస్తుతం బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నారు.బాలయ్య ఇంటికే పరిమితం కానున్న నేపథ్యంలో బాలయ్య తర్వాత సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.రోజా చెప్పిన డైలాగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు