యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృతి...!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తేజ ఫుడ్ ఇండస్ట్రీస్ కి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటోను,అదే సంస్థకు చెందిన బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం గ్రామానికి చెందిన ఏడుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలిస్తుండగా పరిస్థితి విషమించి శిరీష,ధనలక్ష్మి, నాగలక్ష్మి,అనసూయ అనేనలుగురు మహిళా కూలీలు మృత్యువాత పడగా,ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్ర పొందుతున్నారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఓకే గ్రామానికి చెందిన నలుగురు మహిళలు మృతి చెందడంతో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో విషాదఛాయలు అలుముకున్నాయి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

Latest Suryapet News