అప్పుడప్పుడు సెలబ్రెటీల పైన నెటిజన్స్ బాగా ఫైర్ అవుతూ ఉంటారు.నెగటివ్ కామెంట్స్ చేస్తుంటారు.
ఎందుకంటే సెలబ్రేటిల ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి.ఇక ఈ మధ్య బుల్లితెర సెలెబ్రేటిలు బాగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నారు.
ఎందుకంటే వారు మితి మీరీ చేస్తుంటారు.అయితే తాజాగా మరో బుల్లితెర ఆర్టిస్ట్ పై బాగా ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.
ఇంతకూ ఆమె ఎవరో కాదు.రీతూ చౌదరి.
తెలుగు బుల్లితెర నటి, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది.కెరీర్ మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి మంచి అభిమానం సంపాదించుకుంది.
ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి నటనకు గుర్తింపు తెచ్చుకుంది.అలా ఆమెకు వెండితెరపై సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెరపై సీరియల్ నటిగా అవకాశం రావడంతో ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
బుల్లితెరపై గోరింటాకు సీరియల్ లో అడుగు పెట్టి తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఆ తర్వాత అమ్మకోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్ లో కూడా నటించింది.
సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చింది.ఇక ఓసారి కామెడీ షో జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టింది.
ఇక తొలిచూపులతో జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో ఇక అక్కడ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.ఇక తను కూడా బాగా కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
జబర్దస్త్ లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.ఓవైపు సీరియల్స్ లో కూడా బాగా బిజీగా మారింది.అంతేకాకుండా తీరిక సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో అడుగుపెట్టి మరింత హల్ చల్ చేస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మాత్రం మతి పోవడం గ్యారెంటీ.
సీరియల్ టైం లో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి నటులతో రీల్స్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.
అలా సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.తను ధరించే దుస్తులను చూస్తే మతి పోతుంది.పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా షో చేస్తుంది.
ఈమె తండ్రి కూడా ఈమెతో చాలా రీల్స్ చేశాడు.అవి కూడా బాగా క్లిక్ అయ్యేవి.
అలా తన తండ్రిని కూడా సోషల్ మీడియా ప్రియులకు పరిచయం చేసింది రీతూ చౌదరి.అయితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ బాగా ఎమోషనల్ అయింది రీతూ.పైగా తన తండ్రి సోషల్ మీడియా ప్రియులకు పరిచయం ఉండటంతో సోషల్ మీడియా ప్రియులు కూడా తన తండ్రి మరణించిన విషయాన్ని తట్టుకోలేక పోయారు.ఇక ఆమె పోస్ట్ చేసిన ప్రతిసారి ఆమెకు ధైర్యం ఇస్తూ ఉన్నారు.తన తండ్రి చనిపోయి కనీసం ఒక నెల రోజులు కూడా కాలేదు.బాగా పోస్ట్ లు షేర్ చేస్తుంది.అయితే తాజాగా తాను కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.సిగ్గు లేని జన్మ అంటూ తిడుతున్నారు.
రకాలరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.