బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా విష్ణు ప్రియ, రీతు చౌదరి.. ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిన యాంకర్?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Telugu 8 ) కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

తెలుగులో ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.

సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు.అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Rithu Chowdary And Vishnu Priya Gives Clarity About Bigg Boss 8 Entry Details,bi

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే వారిలో యాంకర్ విష్ణుప్రియ( Vishnu Priya ) , రీతూ చౌదరి( Rithu Chowdary ) కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ ఈసారి హౌస్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారంట వార్తలు వస్తున్నాయి నిజానికి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు ఎక్కడికి వెళ్లినా కూడా ఇద్దరు కలిసే వెళ్తూ ఉంటారు.ఇక సోషల్ మీడియాలో కూడా వీరిద్దరి హంగామా మామూలుగా ఉండదు.

Advertisement
Rithu Chowdary And Vishnu Priya Gives Clarity About Bigg Boss 8 Entry Details,Bi

పొట్టి పొట్టి దుస్తులు ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తూ ఉంటారు.

Rithu Chowdary And Vishnu Priya Gives Clarity About Bigg Boss 8 Entry Details,bi

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరికి బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు విష్ణు ప్రియ సమాధానం చెబుతూ అలాంటి అవకాశం వస్తే నేను హౌస్ లోకి వెళ్లి 10 కేజీల వరకు బరువు తగ్గుతారని సంతోషం వ్యక్తం చేశారు.చాలామంది తాను బిగ్ బాస్ లో వెళ్లాలని కోరుకుంటున్నారు.

అయితే ప్రేక్షకుల ఆదరణ ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే తప్పకుండా బిగ్ బాస్ కార్యక్రమంలో కనిపిస్తాను అంటూ ఈమె పరోక్షంగా తాను పాల్గొనబోతున్నానని చెప్పారు.రీతు చౌదరి కూడా సేమ్ ఆన్సర్ అని చెప్పడంతో వీరిద్దరూ ఈసారి హౌస్ లోకి సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు