సినీ నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రాజకీయాలపై ఆసక్తితో ఈయన జనసేన పార్టీని స్థాపించారు ఇలా జనసేన పార్టీ ( Janasena Party ) స్థాపించిన తర్వాత మొదటిసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు.ఇల రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్( First Crush ) గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
![Telugu Ap Deputy Cm, Chiranjeevi, Crush, Pawan Kalyan, Tollywood-Movie Telugu Ap Deputy Cm, Chiranjeevi, Crush, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Ap-Deputy-CM-Pawan-Kalyan-First-Crush-Gun-tollywood-social-media.jpg)
పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా రాజకీయాల పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈయన తరచూ తన వ్యక్తిగత విషయాల ద్వారా విమర్శలు పాలవుతున్న సంగతి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ మొదట్లో కుటుంబ సభ్యుల ఇష్టం ప్రకారం నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.అనంతరం నటి రేణు దేశాయ్ తో ప్రేమలో పడిన ఈయన తనని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు అనంతరం తనతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న విడిపోయారు.
![Telugu Ap Deputy Cm, Chiranjeevi, Crush, Pawan Kalyan, Tollywood-Movie Telugu Ap Deputy Cm, Chiranjeevi, Crush, Pawan Kalyan, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/07/Ap-Deputy-CM-Pawan-Kalyan-First-Crush-Gun-tollywood-social-media-viral.jpg)
ప్రస్తుతం అన్నా లెజీనోవా అనే మహిళను మూడవ వివాహం చేసుకున్నారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఈయన పై ఎన్నో ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఈయన ఫస్ట్ క్రష్ తన ముగ్గురు భార్యలు ఎవరు కాదండోయ్.ఇక ఫస్ట్ ప్రెష్ అంటే అమ్మాయి అనుకుంటే మనం పొరపాటు పడ్డట్లే ఈయన తన పస్ట్ క్రష్ గన్( Gun ) అని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ కు గన్నులు అంటే చాలా ఇష్టమట.
ఈయనకి గన్నుల పట్ల ఉన్నటువంటి పిచ్చి చూసి చిరంజీవి ( Chiranjeevi ) ఎక్కడ ఉగ్రవాదులలో కలిసిపోతారని భయపడే వారట.అంతలా తనకు గన్ అంటే పిచ్చని పడుకున్న గన్ తన పక్కనే ఉండాల్సిందే అంటూ తన ఫస్ట్ క్రష్ గురించి పవన్ కూడా గతంలో పలు సందర్భాలలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.