పాపం.. కోటా శ్రీనివాస్ ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాడు: వర్మ

సాధారణంగా మన ఇంటి పరమాన్నం కంటే పక్కింటి పుల్లగూరకే ఎక్కువ విలువనిస్తుంటారు ఇంట్లో వాళ్ళు.

అలానే టాలీవుడ్ లో కూడా మన తెలుగు నటుల కంటే కూడా పక్క నుంచి వచ్చిన బాలీవుడ్, కోలివుడ్ నటులకే ఎక్కువ విలువ ఇస్తుంటారు.

మన మెగాస్టార్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ అక్కడ సాధారణ యాక్టర్ కి ఇస్తుంటారు.ఆశ్చర్యంగా ఉన్నప్పటికి అది నిజం.

ఇంకా ఈ విషయంపైనే కోట శ్రీనివాస్ గారు బాగా ఫీల్ అయ్యారట.రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ సంచలన విషయాన్నీ బయటపెట్టారు.

అది ఏంటంటే.ఓ సినిమా తీసే సమయంలో బాలీవుడ్ నుంచి పరేష్ రావల్ అనే నటుడిని తీసుకొచ్చారట.

Advertisement

అందులో కోటశ్రీనివాస్ రావు కూడా ఇంచుమించు అలాంటి పాత్రే పోషిస్తున్నారట.కానీ పరేష్ రావల్ కు 60 లక్షలు ఇస్తున్నారట.

కోట శ్రీనివాస్ రావుకు మాత్రం 6 లక్షలే ఇస్తున్నారట.నిజానికి బాలీవుడ్ లో పరేష్ రావల్ కి ఎంత ఫెమ్ ఉందో టాలీవుడ్ లో కోటశ్రీనివాస్ రావు కు అంతే ఫేమ్ ఉంది.

కానీ అతను బాలీవుడ్ అవ్వడం వల్ల అతనికి 60 లక్షలు ఇచ్చారట.ఏంటయ్యా ఈ అన్యాయం అని కోట శ్రీనివాస్ రావు ఫీల్ అయినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు