అసంతృప్త నేత‌ల‌కు రేవంత్ వార్నింగ్.. ప‌గ్గాలు తీసుకున్న రోజే..!

తెలంగాణ కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అవుతాడంటే చాలామంది సీనియ‌ర్లు తీవ్రంగా వ్య‌తిరేకించారు.

అవ‌స‌ర‌మైతే తాము పార్టీ నుంచి త‌ప్పుకుంటామ‌ని, తమ‌కే ఇవ్వాలంటూ ప‌ట్టు బట్టారు.

దీంతో ఢిల్లీ అధిష్టానం కూడా కాస్త వెన‌క్కు త‌గ్గి రేవంత్ నియ‌మకాన్ని తాత్కాళికంగా ఆపేసింది.ఇక దొరికిందే సందు అన్న‌ట్టు సీనియ‌ర్లు అంతా రేవంత్‌కు వ్య‌తిరేకంగా లేఖ‌లు రాశారు.

సోనియా గాంధీకి జ‌గ్గారెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, వీహెచ్ లాంటి కీల‌క నేత‌లు కూడా లేఖ‌లు రాశారు.దీంతో అప్ప‌టి నుంచే వారిపై రేవంత్ కూడా కాస్త స్త‌బ్ధుగానే ఉన్నారు.

ముందు త‌న‌కు పీసీసీ వ‌చ్చిన త‌ర్వాత వారి విష‌యం చూడొచ్చు అనుకున్న‌ట్టు ఉన్నారు.అందుకే మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గానే ఉన్న రేవంత్ నిన్న ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

Advertisement

కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ గా నిన్న బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్‌రెడ్డి ఈ సంద‌ర్భంగా వ‌ప‌ర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు.ఇదే సంద‌ర్భంగా త‌న మార్కును కూడా చూపించారు.

కాంగ్రెస్‌లో ఎవ‌రైనా వ్య‌క్తిగ‌త నినాదాలు ఇస్తే వారిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఇది కాస్త కాంగ్రెస్లోని అసంతృప్త‌త నేత‌ల‌కు వార్నింగ్‌లాగే అనిపిస్తోంది.మ‌రీ ముఖ్యంగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు ఇది పెద్ద దెబ్బ కొట్టిన‌ట్టే అని కాంగ్రెస్‌లో చ‌ర్చ మొద‌లైంది.ఇక రేవంత్ ఇలా ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే కాంగ్రెస్‌ను లైన్ లో పెడుతున్నారంటూ మ‌రి కొంద‌రు భావిస్తున్నారు.

అయితే రేవంత్ మాత్రం త‌న మార్కును చూపించుకునేందుకు ఇలాంటి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నార‌ని అంటున్నారు.కానీ రేవంత్ వ‌చ్చీ రాగానే ఇలాంటి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం మాత్రం సీనియ‌ర్లకు మింగుడుప‌డ‌టం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వారిని బుజ్జిగించి మ‌ద్ద‌తు కోరాలి గానీ ఇలా బెదిరింపు ధోర‌ణి ఏంట‌ని చాలామంది అనుకుంటున్నారు.చూడాలి మ‌రి ముందు ముందు రేవంత్ ఇంకెలాంటి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తారో.

Advertisement

తాజా వార్తలు