ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందనే ఆలోచనతో రేవంత్ ఉన్నారు.
అందుకే ఇంతగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నారు.ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ స్పీడ్ మరింత పెంచారు.
దీంతో పాటు పిసిసి అధ్యక్ష బాధితులు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించడంతో మరింత ఉత్సాహంగా రేవంత్ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నారు.అయితే ఇదంతా పైకి కనిపిస్తోంది.
కానీ రేవంత్ అసలు టార్గెట్ అంతా బిజెపి అని, బిజెపి ని టార్గెట్ చేసుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని, తెలంగాణలోనూ పూర్తిగా ఆ పార్టీ ప్రభావం తగ్గించగలిగితే ఆ విషయంలో సక్సెస్ అయినట్టేనని రేవంత్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే పైకి టిఆర్ఎస్ తో పోరాటం అన్నట్లుగా ఉన్నా, అసలు టార్గెట్ అంతా బీజేపీనే అన్నట్లుగా రేవంత్ వ్యవహారం కనిపిస్తోంది.
రేవంత్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీ నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు.పాలమూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.
అలాగే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు కూడా కాంగ్రెస్ వైపు కు వచ్చారు.అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా రేవంత్ వైపు వస్తారని ప్రచారం జరుగుతోంది.

మెల్లి మెల్లిగా బిజెపి నుంచి కీలకమైన నాయకులందరినీ తమవైపు తిప్పుకుని ఆ పార్టీని బలహీనం చేయాలనే లక్ష్యంతో రేవంత్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారిగా పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఆందోళన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిర్మల్ ను ఎంచుకున్నారు.
అలాగే దళిత దండోరా పేరుతో లక్ష మందితో రేవంత్ ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.ఆగస్టు 9న జరగబోయే ఈ ఉద్యమం కూడా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచే ప్రారంభిస్తున్నారు.
అదిలాబాద్ జిల్లాలో ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు.

అయినా దళిత దండోరా అక్కడి నుంచి ప్రారంభించడం వెనుక బీజేపీని దెబ్బకొట్టాలనే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపిస్తోంది .ఆదిలాబాద్ జిల్లా లో బిజెపికి గట్టి పట్టు ఉండటం, ఈ జిల్లా నుంచి ధర్మపురి అరవింద్ ఎంపీ గా ఉండటం తదితర కారణాలతో ఈ జిల్లాలో బిజెపి పట్టు పూర్తిగా తగ్గించి , ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లో బిజెపికి బలం ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఆ పార్టీని బలహీనం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.
.