ఏపీలో క్యాన్సర్ బాధితులకు జగన్ ప్రభుత్వం భరోసా..!!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వైద్య రంగానికి సంబంధించి సీఎం జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.పేదవాడికి విద్య వైద్యం విషయంలో ఎక్కడా కూడా ఏది భారం కాకుండా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Jagan Governament Good News To Cancer Patients Ys Jagan, Dr Nori Dattathriya, Ys-TeluguStop.com

ఆరోగ్య శ్రీ పరిధిలోకి గత ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక కొత్త రోగాలు కార్డు లో చేర్చడం జరిగింది.ఇదిలా ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ రోగుల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి రెడీ అయింది.

విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో సలహాదారుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నీ నియమించడానికి రెడీ అయ్యారు.ఈ మేరకు ప్రభుత్వ వైద్య శాఖకు జగన్ ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగిందట.

క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయ సీఎం ను కలిసిన తర్వాత రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ప్రత్యేకమైన క్యాన్సర్ అత్యాధునిక ఆసుపత్రులు  నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.వీటిలో ఒక ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీ తో.వైద్య సేవలందించడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube