పెనుగొండ, (సత్యసాయి జిల్లా): వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలెందుకు అచ్చెన్నాయుడు గారు.ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, భాజపా, ఆంధ్రప్రదేశ్.
ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా తెలుగుదేశం పార్టీ తీరు.చాలా ఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు ! ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు ! ఇప్పుడు కేంద్రం, బీజేపీ చర్యలు తీసుకోవాలని ప్రకటనలు ఎందుకు ? రాష్ట్రాల శాంతి భద్రతల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం 2018-19 సమయంలోనే రాష్ట్రపతి పాలన వచ్చేది కాదా ?
ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ .మరో వైపు పార్టీని దెబ్బతీసే ప్రకటనలు ఎందుకు ? యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ ! చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని అచ్చెన్నాయుడును సూచిస్తున్నాం ! సోము వీర్రాజు గారిని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు!