ఓ వ్యక్తి సొంతంగా ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తూ, రాత్రి సమయంలో వేరే మెడికల్ షాప్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అతని భార్య ఇంటి వద్ద చీరల వ్యాపారం చేస్తోంది.
అయితే కస్టమర్ కు చీరలు కావాలని భార్యను అడిగి, చీరలను ప్యాక్ చేసుకుని బైక్ పై వెళ్లిన వ్యక్తి మరుసటి రోజు శవంగా కనిపించిన ఘటన నంద్యాల జిల్లా( Nandyala ) నందికొట్కూరు తాలూకా పాతకోట గ్రామంలో చోటుచేసుకుంది.అసలు వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.నందికొట్కూరు తాలూకా ప్రాతకోట గ్రామంలో రాము( ramu ) (42), మాధవి( Madhavi ) అనే దంపతులు నివాసం ఉంటున్నారు.వీరికి శరత్ చంద్ర ( Sarat Chandra )(9) అనే కుమారుడు సంతానం.రాము సొంతంగా ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారడు.రాత్రి సమయంలో పైప్రాతకోట గ్రామంలో లక్ష్మన్న అనే వ్యక్తికి చెందిన మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు.రాత్రి 7:30 గంటలకు బయటకు వెళ్తున్నానని యజమాని లక్ష్మన్నకు చెప్పి ఇంటికి వచ్చాడు.భార్యతో కొందరు చీరలు కావాలని అడిగారని, ఐదు చీరలు ప్యాక్ చేసి ఇవ్వాలని భార్యను కోరాడు.రాము చెప్పినట్లే అతని భార్య 5 చీరలను ప్యాక్ చేసి ఇచ్చింది.
బైక్ పై ఆ ఐదు చీరలు తీసుకొని రాము ఇంటి నుండి బయలుదేరాడు.

భార్య మాధవి రాత్రి 8:30 గంటల సమయంలో భర్తకు ఫోన్ చేస్తే తాను మెడికల్ షాప్ లో ఉన్నానని చెప్పాడు.ఆ తర్వాత మాధవి మళ్ళీ 9:30 గంటలకు ఫోన్ చేస్తే రాము ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.మరుసటి రోజు ఉదయం భాస్కరాపురం బ్రిడ్జి వద్ద రాము హత్యకు గురై శవంగా కనిపించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టాడు.భార్య మాధవిని విచారించగా తన భర్త రాము గత కొంతకాలంగా ఒక మహిళతో మాట్లాడుతూ ఉండేవాడని, ఎవరని ప్రశ్నిస్తే మందుల కోసం కస్టమర్లు ఫోన్ చేస్తున్నారని చెప్పేవాడు.
తన ముందు ఫోన్ మాట్లాడకుండా బయటకు లేదా మిద్దె పైకి వెళ్లి మాట్లాడేవాడని తెలిపింది.పోలీసులు వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.రాము ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.







