ఆ విషయంలో వెనక్కి తగ్గిన రేవంత్ కు అయిన నిరాశే మిగిలిందా ?

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మధ్య గత కొంతకాలంగా గట్టిపోటి ఉంది.

ఈ విషయంపై హై కమాండ్ కూడా ఆందోళన చెందుతుంది.

ఈ నేపథ్యంలో జానా రెడ్డి రంగంలోకి దిగి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ చీఫ్ పదవి గురుంచి ఆలోచించాలని హై కమాండ్ ను కోరడంతో మరికొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు.అయితే రేవంత్ రెడ్డి ఈ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

తనకు హై కమాండ్ నుండి మద్దతు ఉన్నదని భావిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఈ నిర్ణయంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు.టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని అప్పజెప్పాలని కోరాడు.

టీపీసీసీ పదవి విషయంలో రేవంత్ కాంప్రమైజ్ కూడా అయ్యాడని తెలుస్తుంది.మాలో ఎవరికి ఆ పదవిని కట్టబెట్టిన నాకు సమ్మతమే అన్నాడు.

Advertisement

కానీ కాంగ్రెస్ హై కమాండ్ జానా రెడ్డి సూచన మేరకు ఆ పదవిని పక్కన బెట్టడం రేవంత్ కు నచ్చలేదని తెలుస్తుంది.

కోమటి రెడ్డి కాదని రేవంత్ రెడ్డి కి ఈ పదవిని కట్టబెడుతే పార్టీ మారుతామని వి.హనుమంత రావు బహిరంగంగానే ప్రకటించాడు.నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కు ఇంకా మూడు నెలల సమయం ఉంది.

అప్పటివరకు పరిస్థితులు మారితే మాత్రం మరల ఆ పదవి కోసం గట్టిపోటీనే ఎదురుకావచ్చు.బి‌జే‌పి తెలంగాణలో ఇప్పుడిప్పుడే బలపడాలని చూస్తుంది.చాలా మంది టి.కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ మరేందుకు సిద్దంగా ఉన్నారు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు