టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‎తో రేవంత్ రెడ్డి భేటీ..!

టీజేఎస్ కార్యాలయానికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు.ఈ మేరకు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక మంత్రి బోసురాజు, కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఉన్నారు.ఈ సమావేశంలో భాగంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్ధతు తెలపాలని కోదండ రామ్ ను రేవంత్ రెడ్డి కోరారు.

కాగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేసేందుకు కోదండరామ్ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రచారం, రోడ్ మ్యాప్ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు