జీలుగ విత్తనాల కోసం సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కు మరియు ప్రభుత్వ విప్ కు వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు సరిపడు జీలుగ విత్తనాలు సరఫరా చేయాలని కోరుతూ తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి కి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పోన్ ద్వారా విన్నవించారు.

మండలానికి 300 క్వింటాళ్ల జిలుగ విత్తనాలు అవసరమని మండల వ్యవసాయాధికారి భూం రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఆందజేయగా 250 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మాత్రమే సరఫరా కాగ వాటిని రైతులకు సరఫరా చేశారు.

ఇంకా 50 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు తక్కువ పడగా ఇట్టి విషయాన్ని తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తెలుపగా స్పందించిన వీరు వెంటనే జిల్లా వ్యవసాయాధికారికి పోన్ చేసి రైతులకు సరిపడు విత్తనాలు వెంటనే రెండు లేదా మూడు రోజులలో అందేలా చూడాలనీ జిల్లా వ్యవసాయాధికారికి ఆదేశాలు జారీ చేశారు.రైతుల సమస్యలను తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ అవినాష్ రెడ్డి దృష్టికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్ళిన కాంగ్రెస్ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి కి ఒగ్గు బాలరాజు యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

మోసపూరితమైన యాప్ లలో అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోవద్దు..

Latest Rajanna Sircilla News