గుడ్ న్యూస్ చెప్పిన రిలయన్స్..కస్టమర్లకు అదిరిపోయే ప్లాన్

రిలయన్స్ జియో( Reliance Jio ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.కొన్నేళ్ల కిందట ఉచితంగా కాల్స్, డేటా ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకుంది.

ఆ తరువాత అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కస్టమర్లను సంపాదించుకుంది.ఆ తరువాత ఎన్నో అదిరిపోయే ఆఫర్స్ తో మరింత దగ్గరవుతుంది.

ఇప్పుడు రిలయన్స్ జియో మరో అదిరిపోయే ప్లాన్ తో ముందుకు వచ్చింది.అయితే ఇది కొత్తగా సిమ్ కార్డు తీసుకునేవారికే.

ఒక నెల పాటు ఫ్రీ పోస్ట్ పెయిడ్ ట్రయల్ ప్లాన్ ను అందించనున్నట్టు ప్రకటించింది.ఈ ఆఫర్ లో అదిరిపోయే ప్లాన్ లు ఉన్నాయి.

Advertisement

అవేంటో ఇప్పుడు చూద్దాం.జియో నెట్‌వర్క్‌ని ప్రయత్నించాలనుకునే కొత్త వినియోగదారులు రూ.399, రూ.599, రూ.699 జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను 30 రోజుల పాటు ఉచితంగా ప్రయత్నించవచ్చు.ఆ తరువాత కూడా కొనసాగాలా, వద్ద అన్నది మీ నిర్ణయం.

ఈ ప్లాన్ మీరు మాత్రమే కాదు కుటుంబ సభ్యులను కూడా జోడించుకోవచ్చు.ఇప్పుడు రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి ముందు తెలుసుకుందాం.జియోలో ఎక్కువ మంది ఈ ప్లాన్ ని ఉపయోగించుకున్నారు.

ఈ ప్లాన్ లో మూడు సిమ్ కార్డులు ఉంటాయి.ఒకే నెల తరువాత మీరు ఈ ప్లాన్ ని కంటిన్యూ చేయాలనుకుంటే రూ.99తో చార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.మీకు కేటాయించిన డేటా అయిపోగానే ప్రతి జీబీకి రూ.10 వసూలు చేస్తుంది.ఇక కాల్స్ అన్ లిమిటెడ్ అని తెలిసిందే.

ఇప్పుడు జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి కూడా చూసేద్దామా:

ఇది ఇండివిడ్యూవల్ ప్లాన్, ఈ ప్లాన్ లో యాడ్ ఆన్ సిమ్ లను అనుమతించదు అని గుర్తించుకోవాలి.ఈ ప్లాన్‌లో కూడా అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇకపోతే మరో ప్లాన్ కూడా ఉంది.అదే జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్.ఇది కూడా రూ.399 ప్లాన్ లాగానే ప్రయోజనాలను అందిస్తుంది.కానీ 100జీబీ డేటా ప్రయోజనాలను అందిస్తుంది.

Advertisement

ఈ ప్లాన్ వినియోగదారులకు ఉచిత నెట్‌ఫ్లిక్స్( Netflix ) బేసిక్, వార్షిక ప్రైమ్ వీడియో సభ్యత్వాలను కూడా అందిస్తుంది.ఇక అప్ గ్రేడ్ ఎలా అవ్వాలో కూడా చూసేద్దామా.

అయితే సిమ్ ను మార్చకుండానే ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ఉచిత ట్రయల్‌కు మారే అవకాశం కూడా ఉంది.అదెలానో ఇప్పుడు చూడేద్దాం.

మీ ఫోన్‌లో మై జియో యాప్‌ని తెరవండి.ప్రీపెయిడ్ టు పోస్ట్‌పెయిడ్ మైగ్రేషన్ బ్యానర్‌పై క్లిక్ చేయండి.ఓటీపీ ధ్రువీకరణను పూర్తి చేయండి.

పైన పేర్కొన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో ఒకదానిపై క్లిక్ చేయండి.స్క్రీన్‌పై సూచనలను అనుసరిస్తూ ముందుకెళ్లండి.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఉచిత ట్రయల్ ఆఫర్‌ను ఎలా పొందాలి?జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ హోమ్‌ లోకి వెళ్లండి.మీకు కావాల్సిన ప్లాన్ కింద గెట్ నౌపై క్లిక్ చేయండి.

మీ పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.ఓటీపీ ధ్రువీకరణను పూర్తి చేయండి.

గెట్ కొత్త నంబర్ లేదా పోర్ట్ టు జియో( Port to Jio ) మధ్య ఎంచుకోండి.మీరు ఇష్టపడే కనెక్షన్ రకంలో పోస్ట్‌పెయిడ్‌ని ఎంచుకోండి.

కంటిన్యూపై నొక్కి, తదుపరి పేజీలో మీ చిరునామాను అందించండి.ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి బుక్ సిమ్ డెలివరీపై క్లిక్ చేయండి.

మీరు డెలివరీ కోసం సమయాన్ని సెటప్ చేయడానికి పై ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత జియో ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు.మీకు ఉన్న సందేహనాలు అప్పుడు క్లియర్ చేసుకోండి.

తాజా వార్తలు