జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రభాస్ కారణమా.. ఏమైందంటే?

కొన్ని కాంబినేషన్లలో తెరకెక్కే సినిమాలు భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను నిరాశపరుస్తుంటాయి.

అలా ఎన్టీఆర్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సినిమాలలో కొన్నేళ్ల క్రితం విడుదలైన రామయ్యా వస్తావయ్యా సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫస్టాప్ బాగానే ఉన్నా సెకండాఫ్ మరీ రొటీన్ గా ఉండటంతో సినిమా ఫ్లాపైంది.మాస్ ప్రేక్షకులకు నచ్చిన ఈ సినిమా ఫుల్ రన్ లో 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లకు పరిమితమైంది.

ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు నిర్మించారు.ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ మొదట రామయ్యా వస్తావయ్యా సినిమా కోసం అనుకున్న కథ వేరు అని తెలిపారు.

రామయ్యా వస్తావయ్యా సినిమా విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఆ సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని ఆయన వెల్లడించారు.రెబల్ సినిమా విడుదలకు ముందు తమ సినిమా కథ వేరు అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

కథ బాగా నచ్చడం వల్లే ఎన్టీఆర్, హరీష్, నేను ఆ కథను లాక్ చేసుకున్నామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.రెబల్ సినిమా రిలీజైన తర్వాత ఫాదర్ కు అన్యాయం జరిగితే కొడుకు ప్రతీకారం తీర్చుకునే కథ కరెక్ట్ కాదని ఆ కథను వద్దని అనుకున్నామని దిల్ రాజు పేర్కొన్నారు.రామయ్యా వస్తావయ్యా విషయంలో రాంగ్ స్టెప్ వేశామని ఆయన అన్నారు.

కథ మార్చడం పెద్ద తప్పు అని తర్వాత అర్థమైందని దిల్ రాజు తెలిపారు.

సినిమా ఫ్లాప్ అయితే కథ, బడ్జెట్ వల్ల ఫ్లాప్ అవుతాయని దిల్ రాజు వెల్లడించారు. జోష్, ఓ మై ఫ్రెండ్ సినిమాలను అప్ కమింగ్ వాళ్లతో తీసి ఉంటే సక్సెస్ వచ్చేదని దిల్ రాజు అన్నారు.ఓ మై ఫ్రెండ్ కథ మంచి కథ అని బొమ్మరిల్లు హీరో కావడంతో ఆ సినిమా ఫ్లాప్ అయిందని దిల్ రాజు కామెంట్లు చేశారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు