అతడు మూవీ తర్వాత మురళీ మోహన్ సినిమా నిర్మాణానికి దూరం కావడానికి కారణాలివే?

తెలుగు సినిమాలలో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మురళీ మోహన్ నిర్మాతగా తెరకెక్కిన అతడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది.స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమా ఎక్కువ సార్లు ప్రసారమవుతున్నా ప్రసారమైన ప్రతిసారి మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది.

స్టార్ మా ఛానెల్ ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేసిన మొత్తంతో పోల్చి చూస్తే ఆదాయం ఊహించని స్థాయిలో వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది.2005 సంవత్సరం ఆగష్టు నెల 10వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో హిట్ టాక్ వచ్చినా థియేటర్లలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు.

నిర్మాతగా మురళీ మోహన్ కు అతడు సినిమా చివరి సినిమా కావడం గమనార్హం.ప్రస్తుతం మురళీ మోహన్ పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు.జయభేరి బ్యానర్ పై మురళీ మోహన్ నిర్మాతగా అతడు సినిమా తెరకెక్కింది.

అయితే అతడు సినిమా లాభాలను అందించకపోవడానికి అసలు కారణాలను తాజాగా మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

మేనేజర్లను నమ్మి అతడు సినిమా బాధ్యతలను వాళ్లకు పూర్తిగా అప్పగించానని దగ్గరగా ఉండి సినిమా నిర్మాణాలు చేయాలని లేకపోతే దూరంగా ఉండాలని ఆ సినిమా ద్వారా తనకు అర్థమైందని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.అందువల్లే ఆ తర్వాత తన బ్యానర్ లో సినిమాలు రాలేదని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.

Advertisement

మరోవైపు తాను పాలిటిక్స్ కు కూడా దూరమేనని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.తన వారసులు కూడా పాలిటిక్స్ కు దూరమని మురళీ మోహన్ అన్నారు.కొంతమంది రాజకీయ విషయాలపై స్పందించాలని కోరినా తాను తిరస్కరించానని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు