ఆ ఒక్క రీజన్ వల్లే గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్.. ఆయనే కారణమంటూ?

మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.

దసరా పండుగ కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.

దర్శకుడు మోహన్ రాజాకు కూడా గాడ్ ఫాదర్ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.చిరంజీవి ఆలోచనల వల్లే గాడ్ ఫాదర్ హిట్టైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను యథాతథంగా రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే చిరంజీవి మాత్రం లూసిఫర్ సినిమాలో ఉన్న చిన్నచిన్న తప్పులను కనిపెట్టి ఎంతోమంది డైరెక్టర్లను పరిశీలించి చివరకు మోహన్ రాజాను ఫైనల్ చేశారు.

ఆ ఒక్క రీజన్ వల్లే గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ లో చిరంజీవికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

Advertisement

అయితే అదే సమయంలో చిరంజీవి నటన గురించి విమర్శకులు సైతం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.కళ్లతోనే చిరంజీవి నట విశ్వరూపం చూపించారని ఆరు పదుల వయస్సులో కూడా చిరంజీవి అద్భుతంగా యాక్ట్ చేసి గాడ్ ఫాదర్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిరంజీవి నటన వల్లే గాడ్ ఫాదర్ అంచనాలకు మించి సక్సెస్ సాధించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమాకు 92 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ సినిమా ఆదివారం నాటికి మెజారిటీ ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో సత్యదేవ్ నటనకు ప్రశంసలు దక్కాయి.

గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు