Mahesh Babu Balakrishna : బాలయ్య మాటలకు మహేష్ ఎందుకు నవ్వాడో తెలుసా.. అందుకు గౌతమ్ నే కారణమా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇక తండ్రి మరణంతో మహేష్ బాబు కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు.కృష్ణ గుండె పోటు కారణంతో మరణించారు.

ఈయన మరణంతో కుటుంబం మొత్తం దుఃఖ సాగరంలో ఉన్నారు.ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉండే మహేష్ బాబు తండ్రి మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

మహేష్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం చుసిన ఫ్యాన్స్ కు కూడా దుఃఖం ఆగలేదు.ఒకే ఏడాది కుటుంబంలో ముగ్గురిని పోగొట్టుకుని మహేష్ పూర్తి షాక్ లోకి వెళ్ళిపోయాడు.

Advertisement

అయితే అంత బాధలోనే మహేష్ ను బాలయ్య నవ్వించారు.ఇందుకు కారణం ఏంటో తెలియక పోయిన మహేష్ ను నవ్వించడంతో బాలయ్యను అంతా మెచ్చుకున్నారు.

కృష్ణకు నివాళులు అర్పించిన తర్వాత బాలయ్య కొద్దిసేపు మహేష్ తో ముచ్చటించారు.ఆ సమయంలో మహేష్ తో పాటు ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ, గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

ఆ సమయంలో అసలు మహేష్ నవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు బయటకు వచ్చింది.

బాలయ్య మహేష్ పక్కనే ఉన్న గౌతమ్ ను చూసి మీ వాడు పెద్దోడు అయ్యాడు.హీరోగా పరిచయం చేయవచ్చు అన్నట్టుగా అన్నారట.అప్పుడు గౌతమ్ తో పాటు మహేష్ కూడా నవ్వడం జరిగింది.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

ఇలాంటి కష్టసమయంలో జోకులు వేస్తె విమర్శలు చేస్తారు.కానీ మహేష్ ను నవ్వించిన బాలయ్యకు మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు