బాలయ్య శ్రీదేవితో అందుకే నటించలేదా?

తెలుగు సినీ సీనియర్ స్టార్ నటుడు నందమూరి బాలయ్య గురించి తెలినోలే లేరు.ఇక ఈయన సినిమాలంటే నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు.

బాలయ్య కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు.నాటి నుండి నేటి వరకు ఇండస్ట్రీలో ఇంకా కీలక పాత్రలో నటిస్తున్నాడు బాలయ్య.

అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు కూడా అందుకున్నాడు.ఇదిలా ఉంటే బాలయ్య సరసన చాలావరకు నాటినుండి నేటి వరకు సీనియర్ హీరోయిన్స్ నుండి ఈ తరం హీరోయిన్స్ వరకు ఎంతోమంది నటించారు.

కానీ అలనాటి తార శ్రీదేవి సరసన మాత్రం బాలకృష్ణ ఏ ఒక్క సినిమా కూడా చేయలేదు.అంతేకాకుండా శ్రీదేవి కూడా స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

Advertisement

కానీ బాలయ్య సరసన మాత్రం నటించలేదు.కానీ వీరిద్దరి కాంబినేషన్ లో మాత్రం రెండు సినిమాలు రావాల్సి ఉండేనట‌.

డైరెక్టర్ రాఘవేంద్ర రావు తన దర్శకత్వంలో 1987లో సామ్రాట్ అనే సినిమాను ప్రకటన చేశాడట.ఈ సినిమాను బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ లో తెరకెక్కించాలనుకున్నాడట.ఆ తర్వాత 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ అనే సినిమాలో శ్రీదేవి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

కానీ శ్రీదేవి ఆ సమయంలో హిందీ సినిమాలలో వరుస ఆఫర్ లతో తెగ బిజీగా ఉండేనట‌.ఇక ఆ సమయంలో శ్రీదేవి బిజీగా ఉన్నందున బాలకృష్ణ ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పకుందని తెలిసింది.

ఇక ఆ తర్వాత బాలయ్యతో ఏ ఒక్క సినిమా కూడా నటించలేదు.ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకున్నాడు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు