వైసీపీ అధినేతగా. వైఎస్ జగన్ వేరు.
ఇప్పుడు ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వేరు!-అప్పట్లో.ప్రజల్లోకి నేరుగా వచ్చారు.
ఆంక్షలను దాటుకుని.ప్రజలను ఆశీర్వదించారు.
భద్రతను కాదన్నారు.ప్రజలే లోకమని చెప్పారు.
కట్ చేస్తే.ఏ అధికారం కోసం.
పాదయాత్ర చేసి.పాకులాడారో.
అది దక్కింది! ఇప్పుడు ఏడాదిన్నర అయింది.ఈ మధ్యలో తేడా ఏం జరిగింది? అనే విషయం పక్కన పెడితే.ప్రజల్లోకి వచ్చేందుకు జగన్ ఇప్పుడు జంకుతున్నారు.వచ్చినా.పది నిముషాలు.పావుగంటకు మించి.
ఆయన ఎక్కడా ఉండడం లేదు.ఒక్కమాటలో చెప్పాలంటే.
ప్రజలను దూరంగా పెట్టారు!!
ఎందుకు? ఇలా జగన్ వ్యవహరిస్తున్నారు ? వ‌్యూహం మార్చుకున్నారా ? లేక.ఏం జరిగింది ? అంటే.ఈ ఏడాదిన్నర కాలంలో జగన్ అనుసరించిన వైఖరిని రెండు భాగాలుగా విడదీస్తే.తొలి 8 నెలలు బాగానే ఉంది. సచివాలయాలు, పింఛన్ల పెంపు, పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు, ఆరోగ్య శ్రీ వంటి పథకం అమలు .వంటి వాటితో దూకుడుగా ముందుకు వెళ్లారు.అయితే.తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది.మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత.రెండో ఏడాదిలో పెంచుతామన్న పింఛన్‌ను పెంచలేకపోయారు.
అదేసమయంలో పాలన పరంగా.తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు సమ్మతిస్తున్నారో.
లేదో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

ఎక్కడికక్కడ ఎస్సీ సామాజిక వర్గాలపై దాడులు పెరుగుతున్నాయి.శిరోముండనం కేసులు రాష్ట్రాన్ని అల్లాడిస్తున్నాయి.మహిళలు, యువతులకు రక్షణ లేకుండా పోయింది.
మరోవైపు రాజకీయ నేతల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి.ఇసుక లభించడం లేదు.
పేదలకు ఇస్తామన్న ఇళ్లు ఇవ్వలేదు.అన్న క్యాంటీన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామంటూ.
మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రకటన చేయించినా.ఇప్పటికీ వాటికి సంబంధించిన కార్యాచరణ లేదు.
ఉపాధి విషయంలో ఒక్క సచివాలయాలను తప్పిస్తే.మిగిలిన రంగాల్లో ప్రోత్సాహం లేదు.
ఇలా అనేక సమస్యలు ఉన్నాయి.అనే ఇబ్బందులు వెంటాడుతున్నాయి.వీటిలో కీలకమైనవి పెంచుతామన్న పింఛన్ రూ.250 పెంచకపోవడం, ఇసుక లభించకపోవడం, మద్యం ధరలు ఆకాశానికి ఎత్తేయడం.పేదలకుఇళ్ల పంపిణీలో ఆలస్యం.సో.ఇవన్నీ.ప్రజల నుంచి నిలదీతలుగా మారే అవకాశం కనిపిస్తోంది.
అందుకే జగన్ మౌనం పాటిస్తున్నారని.ఇప్పుడు తానేం మాట్లాడినా.
ప్రజల నుంచి శరాల వంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్టు ఉన్నారు.దీంతో ఎక్కడికి వెళ్లినా.
ఓ సభ లేదు.ఓ సమావేశం లేదు.
కేవలం పని ముగించుకుని తాడేపల్లికి వచ్చేయడమే.!
.