రేవంత్ పిటిషన్ కొట్టివేసిన ఏ‌సి‌బి న్యాయస్థానం ! కారణం ఏమిటంటే ?

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టి‌డి‌పి పార్టీలో ఉన్నపుడు ఆయన పై ఓటు కు నోటు కేసు నమోదు అయింది.

ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించిది.

టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే నన్ను ఇందులో ఇరికించిందని ఆరోపించాడు.టి‌డి‌పి నేత చంద్రబాబు నాయుడు కూడా ఇందులో పాత్ర ఉందని టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

రేవంత్ రెడ్డి మాత్రం ఏ1 గా ఉన్నాడు. ఓటు కు నోటు కేసు పై రేవంత్ రెడ్డి ఇది ఏ‌సి‌బి పరిధిలోకి రాదు ఎన్నికల పరిధిలోకి వస్తుంది అంటూ పిటిషన్ ధాఖలు చేశాడు.

నేడు ఏ‌సి‌బి న్యాయస్థానం రేవంత్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.ఈ కేసు ఎన్నికల పరిధిలోకి రాదు.

Advertisement

ఏ‌సి‌బి పరిధిలోకి వస్తుందని చెబుతూ రేవంత్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది.తదుపరి కేసు విచారణ ఫిబ్రవరి 8న జరగనున్నది.

ఆరోజు ఓటు కు నోటు కేసులో ఎంత మందిపై అయితే కేసు నమోదు అయ్యిందో అందరు హాజరు కావాలని కోరింది.ఈ విషయంపై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్ నుండి టి‌పి‌సి‌సి చీఫ్ పదవి రేస్ లో ఉన్న రేవంత్ కు ఓటు కు నోటు కేసు పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.

పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు