RBI వ్యూహం....”ఎన్నారై బాండ్ల”తో మన రూపాయి బలోపేతం..!!!

రూపాయి మారక విలువ డాలర్ తో పోల్చి చూస్తే రోజు రోజుకు క్షీణించి పోతోంది.

ఈ పరిస్థితుల నేపధ్యంలో రూపాయిను బలపరుచుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్బి ఐ పలు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.బంగారం దిగుమతులపై ఆంక్షలు విధించడం, అలాగే రూపాయిని బలపరచడానికి భారత ప్రవాసుల బాండ్ల విక్రయాలు చేపట్టడం ఇలా కొన్ని ప్రత్యేక కార్యాచరణాలు చేపట్టనుందని అంటున్నారు పరిశీలకులు.

పూర్తి వివరాలలోకి వెళ్తే.భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళిన ఎన్నారైలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు గాను తమ నిధులను ఎన్నారై బాండ్స్ ద్వారా భారత్ లోకి మళ్ళిస్తారు.

రిజర్వ్ బ్యాంక్ ఎన్నారైల కోసం జారీ చేసే సెక్యూరిటీ లే ఈ ఎన్నారై బాండ్స్.ఈ బాండ్స్ ద్వారా తమ నిధులను భారత్ కి మళ్ళించుకోవచ్చు.

Advertisement

అయితే ఇప్పుడు ఆర్బిఐ ఈ బాండ్స్ ను విక్రయించడం ద్వారా భారత్ లోకి డాలర్ నిధులను మరింత పెంచుకోవచ్చునని ఆర్బిఐ యోచిస్తోంది.ఈ పద్దతి ద్వారా ఎలా రూపాయి బలపడుతుందంటే.

ఎన్నారై బాండ్స్ ను కొనుగోలు చేసే క్రమంలో డాలర్ల ను రూపాయి లోకి మార్చుకోవాల్సి వస్తుంది.దాంతో ఫారెక్స్ లో రూపాయి పెరగడంతో మన రూపాయి విలువ పడిపోకుండా చూస్తుంది.ప్రస్తుతం రూపాయి ని బలపరిచుకోవాలంటే ఫారెక్స్ లో మార్కెట్ లో భారత్ కు 95 బిలియన్ డాలర్ల బాండ్స్ విక్రయించే వెసులుబాటు ఉండాలి.

ఈ అవకాశం భారత్ కు పుష్కలంగా ఉందని నిపుణులు అంటున్నారు.అంతేకాదు బంగారం దిగుమతులు తగ్గించడం వలన రూపాయి విలువ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆర్ధిక నిపుణులు.

ఏది ఏమైనా ప్రస్తుతం రూపాయి విలువ పతనం కాకుండా ఉండేందుకుగాను ఎన్నారై బాండ్స్ విక్రయం అనేది తప్పనిసరి మార్గంగా మారింది.Attachments area .

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు