మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ధమాకా’.ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.
రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను త్రినాధరావు నక్కిన తెరకెక్కించాడు.ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న భారీ పోటీ మధ్యనే రిలీజ్ అయ్యింది.
ఈ బరిలో చాలా సినిమాలే వచ్చిన ధమాకా మాత్రమే రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది.
రిలీజ్ అయ్యి దగ్గర దగ్గరగా నెల అవుతున్న ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని కలెక్షన్స్ రాబడుతుంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.ఈ సినిమా సక్సెస్ తో రవితేజ తన క్రేజ్ ఏంటో ఇలాంటి మాస్ సినిమా పడితే ఈయన స్టామినా ఎలా ఉంటుందో చూపించాడు.

ఇక ధమాకా క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ 20 ముందే కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.మరి ఇప్పటికి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ముగిసింది.28 రోజులలో ఈ సినిమా నైజాంలో 19 కోట్లు, సీడెడ్ లో 8 కోట్లు, కృష్ణలో 1.85 కోట్లు, గుంటూరులో 1.91 కోట్లు, నెల్లూరులో 1.25 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.3 కోట్లు తూర్పు గోదావరిలో 1.35 కోట్లు సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్ల షేర్ 70 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.

ఇక మిగతా ప్రాంతాల్లో 3 కోట్ల 75 లక్షల షేర్ ఓవర్సీస్ లో 3 కోట్లు వసూళ్లు రాబట్టింది.వరల్డ్ వైడ్ గా 45 కోట్ల షేర్ 85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి మాస్ రాజా కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.ఈ సినిమా మొత్తంగా డిస్టిబ్యూటర్స్ కు 25 కోట్ల లాభాలను మిగిల్చినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా 2022 ఏడాది చివరిలో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.







