కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేంద్రం తన ఎనిమిది ఏళ్ల పాలనలో వంద లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు.
ఈ ఎనిమిది సంవత్సర కాలంలో కేంద్రం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు.బీఆర్ఎస్ పై కారుకూతలు కూస్తూ అసత్యాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నా కేటీఆర్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.కేంద్రం సహకరించకపోయినా కేటీఆర్ తన స్వశక్తితో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నా ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వెల్లడించారు.







