ఒక బంతికి రెండు రివ్యూలు.. స్టేడియంలోని క్రికెట్ ప్రేక్షకులు షాక్..!

తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో( Tamilnadu Premier League ) ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకుని వింతలు ఈ లీగ్ లో చోటు చేసుకుంటూ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇటీవలే కేవలం ఒకే ఒక బంతికి 18 పరుగులు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయం మర్చిపోకముందే మరొక వింత సంఘటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది.

తాజాగా బుధవారం తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోయంబత్తూర్ వేదికగా దిండిగుల్ డ్రాగన్స్- బా 11 ట్రిచ్చి మధ్య మ్యాచ్ జరిగింది.ట్రిచ్చి ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ ను యాష్ క్యామ్ బౌలింగ్ చేశాడు.

అయితే ఈ ఓవర్ లో చివరి బంతి వేయగా క్రీజులో ఉన్న బ్యాటర్ రాజ్ కుమార్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.బంతి మిస్ అయి కీపర్ చేతికి వెళ్ళింది.

Advertisement

బంతి బ్యాట్ కు తగిలిన శబ్దం రావడంతో వెంటనే అశ్విన్ తో( Ravichandran Ashwin ) పాటు వికెట్ కీపర్ అప్పీల్ చేశారు.దీంతో అంపైర్ అవుట్ ప్రకటించాడు.వెంటనే బ్యాటర్ రాజ్ కుమార్ రివ్యూ అడిగాడు.

రివ్యూలో బ్యాక్ కు మధ్య గ్యాప్ ఉండడంతో టీవీ అంపైర్ నాటౌట్ ప్రకటించాడు.ఇంతవరకు బాగానే ఉంది.

కానీ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించగానే రవిచంద్రన్ అశ్విన్ రెండోసారి రివ్యూ కోరాడు.స్టేడియంలో కూర్చొని ఇది చూసిన క్రికెట్ ప్రేక్షకులు, ప్లేయర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఆల్రెడీ ఆ బంతికి రివ్యూ తీసుకున్నాక కూడా మళ్లీ రవిచంద్రన్ అశ్విన్ రివ్యూ తీసుకోవడంతో ఏం జరుగుతుందో కాసేపు ఎవరికి అర్థం కాలేదు.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

చాలాసేపు సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత బంతికి బ్యాట్ కు గ్యాప్ ఉండడం, బ్యాట్ నేలను తాకడంతో స్పైక్ వచ్చిందని అది నాట్ అవుట్ అని టీవీ అంపైర్ స్పష్టం చేశాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియోకు ఊహించని రీతిలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన బా 11ట్రిచ్చి 19.1 ఓవర్లకు అన్ని 10 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.లక్ష్య చేదనకు దిగిన దిండిగుల్ 14.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసి విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు