హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు.. దర్శకుడు ఎవరంటే?

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సినీ ఇండస్ట్రీకీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

మొదట కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు.అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం స్టార్ హీరోగా తన సత్తా చాటుతూ వరస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఇక ఇటీవలే క్రాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే హీరో రవితేజకు మహాధన్‌ అనే కొడుకు ఉన్నాడు అన్న సంగతి అందరికి తెలిసిందే.

Advertisement
Ravi Teja Son Mahadhan Soon Entry Hero Tollywood , Ravi Teja , Ravi Teja Son Ent

మహాధన్‌ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించాడు.ఇక అప్పటి నుంచి మహాధన్‌ హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇదే విషయంపై ఇంతకుముందు రవితేజ స్పందిస్తూ మహాధన్‌ చదువు పూర్తి అయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని పేర్కొన్నారు.

Ravi Teja Son Mahadhan Soon Entry Hero Tollywood , Ravi Teja , Ravi Teja Son Ent

ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది.రాజా ది గ్రేట్‌ సినిమాతో రవితేజకు హిట్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయంపై ఇంకా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఇకపోతే రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు